భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: అర్హులైన ఏ ఒక్క ఓటరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు టి.కె. శ్రీదేవి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆమె సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా టి.కె. శ్రీదేవి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని పేర్కొన్నారు. మెరుగైన సమాజ నిర్మాణానికి ఓటు హక్కు పునాది వంటిదన్నారు. ఓటు హక్కు దుర్వినియోగాన్ని…