భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని కోమటిపల్లి గ్రామంలో శనివారం పోషణ మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ మద్దెల బిక్షపతి గౌడ్ అధ్యక్షతన ఐసీడీఎస్ అంగన్వాడీ-1 కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య లోపాలను గుర్తించారు. అంగన్వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన పోషకాహారం, ఆరోగ్యానికి సంబంధించిన చార్టులను సర్పంచ్ మద్దెల బిక్షపతి గౌడ్ ఆసక్తిగా పరిశీలించారు. ఆరు నెలల పాపకు అన్నప్రాశన కార్యక్రమాన్ని నిర్వహించారు.
పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఐసీడీఎస్ ద్వారా…






