భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వీబీజీ రాంజీ పథకంలో చేపట్టే పనులను పారదర్శకంగా నిర్వహించాలని ఎంపీడీవో పార్థసారథి సూచించారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వీబీజీ రాంజీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లకు వీబీజీ రాంజీ పనులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో పార్థసారథి మాట్లాడుతూ.. మండలంలో అవసరమైన ప్రాంతాల్లో పనులను గుర్తించి, ఉపాధి కూలీలకు పనులు కల్పిస్తూ వాటిని వేగంగా పూర్తి చేయాలని సూచించారు. పనుల ఎంపిక నుంచి పూర్తయ్యే వరకు ప్రతి దశలో…