భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గొర్రెలను కడిగేందుకు కుంటలోకి దిగిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన విషాద ఘటన నార్సింగి మండల పరిధిలో చోటుచేసుకుంది. మండలంలోని పెద్ద తండాకు చెందిన మాలోత్ నవీన్ (22), తండ్రి సీత్య, పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులు తండాలోని ఇతరుల గొర్రెలను కూలికి మేపుతూ జీవనం కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో మంగళవారం నవీన్ గొర్రెలను మేపుకుంటూ మధ్యాహ్న సమయంలో ఖాసులాపూర్ పరిధిలోని లింగారెడ్డి కుంట వద్దకు చేరుకున్నాడు. గొర్రెలను కుంటలో…






