భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో జనావాసాల మధ్య రా రైస్ మిల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వవద్దని కోరుతూ గిరిజన మహిళలు, గ్రామస్తులు మంగళవారం రోడ్డెక్కారు. మూతబడిన చిన్న ఆయిల్ మిల్లు స్థానంలో సీఎంఆర్ కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు కొనుగోలు చేసి బియ్యం వ్యాపారం చేసేందుకు భారీ రా రైస్ మిల్ ఏర్పాటు చేస్తున్నారని, ఆ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
మిల్లు నిర్మాణం చేపడుతున్న ప్రాంతం చుట్టుపక్కల నివసిస్తున్న గిరిజనులతో పాటు గ్రామస్తులు…






