భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వ్యవసాయ క్షేత్రాల్లో ఏర్పాటు చేసుకునే నీటి కుంటలు (ఫామ్ పాండ్) రైతులకు బహుళ ప్రయోజనాలను అందిస్తాయని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జెడ్పీ సీఈవో పురుషోత్తం అన్నారు. మంగళవారం మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో రైతులకు చెందిన నీటి కుంటను ఎంపీడీవో సింగారపు కుమార్‌తో కలిసి అదనపు కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఫామ్ పాండ్ నిర్మించుకున్న రైతుతో పాటు వీబీజీ రాంజీ కూలీలు, సిబ్బందితో నీటి కుంట నిర్మాణం ప్రాముఖ్యత, దాని వల్ల కలిగే ప్రయోజనాలపై అదనపు…






