భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిన్నశంకరంపేట మండలంలోని చందంపేట గ్రామ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సర్పంచ్ నాయిని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గ్రామంలోని 9వ వార్డులో రూ.5 లక్షల గ్రామపంచాయతీ నిధులతో చేపట్టనున్న మురుగు కాలువల నిర్మాణ పనులను బుధవారం సర్పంచ్ నాయిని ప్రవీణ్‌కుమార్, పాలకవర్గ సభ్యులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో పారిశుధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా మురుగు కాలువల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో…