భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట సబ్‌స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న తీవ్ర విద్యుత్ కోతలు, లో-వోల్టేజ్ సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు తెలిపారు. రైతుల పంటలను కాపాడేందుకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులను డిమాండ్ చేశారు.
ప్రస్తుతం రైతులు సాగు చేసిన పంటలు తుది దశకు చేరుకున్నాయని, మరో 20 రోజులు పంటలకు నిరంతరంగా నీరు అందితే పంటలు చేతికొచ్చే అవకాశం ఉందని తెలిపారు. అయితే రామాయంపేట సబ్‌స్టేషన్ పరిధిలో…






