భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బొడ్డెమ్మ పండుగ సందర్భంగా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన స్వర్గీయ మాజీ సర్పంచ్ బైరు సోమయ్య సతీమణి బైరు వెంకటమ్మ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. బొడ్డెమ్మ ఉత్సవాల్లో పాల్గొంటున్న మహిళలకు చీరలను వితరణ చేసి పండుగ వేడుకల్లో ప్రత్యేకంగా నిలిచారు.

గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ దేవస్థానం కళావేదిక వద్ద నిర్వహిస్తున్న బొడ్డెమ్మ ఉత్సవాల్లో పాల్గొంటున్న సుమారు 20 మంది మహిళలకు రూ.10 వేల విలువైన చీరలను బుధవారం వెంకటమ్మ అందజేశారు.…