భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: హత్నూర మండలం దౌల్తాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యుత్ సమస్యపై రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా రైతులు ధర్నా నిర్వహించారు. అంతకుముందు కాసాల చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రైతులు ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం చౌరస్తా వద్ద ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పంటలకు అవసరమైన సమయంలో నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరాలో తరచూ…






