భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని వివిధ పాఠశాలల్లో శుక్రవారం ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల ప్రాంగణాలు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో కళకళలాడాయి. విద్యార్థినీ విద్యార్థులు వివిధ రకాల పూలను తీసుకువచ్చి అందంగా బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలు ఆడారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.
వేడుకలకు ముందు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బతుకమ్మ…






