భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి, కోలాటాలు ఆడుతూ, బతుకమ్మ పాటలతో సందడి చేశారు. పాఠశాల ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థుల ఉత్సాహం, రంగురంగుల పూలతో వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి.

ప్రకృతిని పూజించే గొప్ప సంప్రదాయం

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య మాట్లాడుతూ, ప్రకృతిని దైవంగా, పూలను దేవతలుగా భావించి పూజించే గొప్ప సంప్రదాయం…