భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఇనుగుర్తి మండల కేంద్రంలోని విజ్ఞాన్ హైస్కూల్లో ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం నిర్వహించిన ముందస్తు బతుకమ్మ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ గంజి అర్చన రెడ్డి తెలిపారు.
రంగురంగుల పూలతో బతుకమ్మలు.. కోలాటాలతో సందడి
విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో వివిధ రకాల పూలను సేకరించి సంప్రదాయ పద్ధతిలో అందమైన బతుకమ్మలను పేర్చారు. అనంతరం బతుకమ్మ పాటలకు…






