భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తొలిముద్ద కార్యక్రమాన్ని చిన్నారుల తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది సమన్వయంతో విజయవంతంగా అమలు చేసి సద్వినియోగం చేసుకోవాలని సౌల్ల తండా సర్పంచి గుగులోతు సుజాత వాసు సూచించారు. మండలంలోని సౌల్ల తండా ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం సర్పంచి సుజాత వాసు పలువురితో కలిసి తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన…