భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పవిత్ర కార్తీక మాసం సోమవారం సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని పురాతన భక్త మార్కండేయ దేవాలయం శివనామస్మరణతో మార్మోగింది. కార్తీక మాసంలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో శివుడికి మొక్కులు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయంలో శివలింగానికి రుద్రాభిషేకాలు నిర్వహించి, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి పుష్పార్చనలు చేశారు. భక్తులు శివుడిని దర్శించుకుని పూజల్లో…






