భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్డెమ్మ పండుగ చివరి రోజు సందర్భంగా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలోని గురుజు గడ్డ కాలనీలో మహిళలకు బొమ్మెర బ్రదర్స్ బహుమతులు అందజేశారు. శుక్రవారం నిర్వహించిన బొడ్డెమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలను ప్రోత్సహిస్తూ ఈ బహుమతులను పంపిణీ చేశారు.

తాతయ్య, నానమ్మ జ్ఞాపకార్థం బహుమతులు

స్వర్గీయ బొమ్మెర నారయ్య గౌడ్, యాకమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి మనుమలు బొమ్మెర రమేష్ గౌడ్, సతీష్ గౌడ్, సంతోష్ గౌడ్, సందీప్…