భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్డెమ్మ పండుగను ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద బాలికలు, యువతులు, మహిళలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో బొడ్డెమ్మను పూజిస్తూ పాటలు, నృత్యాలతో సందడి చేశారు. శుక్రవారం చివరి రోజు వేడుకలు మరింత ఉత్సాహంగా సాగాయి.

సంప్రదాయ దుస్తుల్లో మహిళల సందడి

చివరి రోజు బొడ్డెమ్మ వద్ద మహిళలు సంప్రదాయ పద్ధతిలో పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఏకరూప చీరలు ధరించి, లయబద్ధంగా…