భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్డెమ్మ పండుగ ఇనుగుర్తి మండలం చిన్ననాగారం అంబేద్కర్ కాలనీలో ఘనంగా జరిగింది. తొమ్మిది రోజుల పాటు యువతులు, మహిళలు భక్తిశ్రద్ధలతో బొడ్డెమ్మను పూజిస్తూ పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. చివరి రోజు శుక్రవారం నిర్వహించిన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పూల బొడ్డెమ్మతో మహిళల సందడి

బొడ్డెమ్మ పండుగ సందర్భంగా యువతులు, మహిళలు వివిధ రకాల పూలతో బొడ్డెమ్మను అందంగా అలంకరించి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించి బొడ్డెమ్మ…