భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇనుగుర్తి మండల కేంద్రంలోని చారిత్రక, మహిమాన్విత శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి ఇనుగుర్తితో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేకువజాము నుంచే ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
అర్చక సమాఖ్య రాష్ట్ర నేత, ప్రముఖ వేద పండితులు, ఆలయ అర్చకులు శ్రీశ్రీశ్రీ తిరునహరి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో పలువురు వేద పండితులు వేదమంత్రాల…





