భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) ఇనుగుర్తి మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా కదిరె ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా సుక్క ఉప్పలయ్యతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం

మండల కేంద్రం ఇనుగుర్తిలో శుక్రవారం నిర్వహించిన కమిటీ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్రాం నర్సయ్య, పరిశీలకుడిగా జిల్లా కార్యదర్శి సంగ శ్రీనివాస్ హాజరయ్యారు. వీరి పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. నూతన…