భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రారంభం కావడంతో నెల్లికుదురు మండలంలో పల్లెలన్నీ పూల సోయగాలతో కళకళలాడుతున్నాయి. తొమ్మిది రోజులపాటు యువతులు, మహిళలు భక్తిశ్రద్ధలతో ఆటపాటల మధ్య గౌరీదేవిని బతుకమ్మ రూపంలో కొలిచే ఈ పండుగలో భాగంగా శనివారం పితృ అమావాస్యను పురస్కరించుకొని మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు.
పల్లెల్లో పూల పండుగ సందడి
మండల కేంద్రం నెల్లికుదురుతో పాటు రావిరాల, మునిగలవీడు, వావిలాల, బ్రాహ్మణ కొత్తపల్లి, మదనతుర్తి, నరసింహుల…






