భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆత్మగౌరవ బతుకమ్మ పండుగ ఇనుగుర్తి మండలంలో శనివారం ఘనంగా ప్రారంభమైంది. మండల కేంద్రం ఇనుగుర్తితో పాటు చిన్ననాగారం, కోమటిపల్లి, చిన్న ముప్పారం, అయ్యగారిపల్లి, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో పితృ అమావాస్యను పురస్కరించుకొని ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు వైభవంగా నిర్వహించారు.
తీరొక్క పూలతో బతుకమ్మలు
మహిళలు తంగేడు తదితర రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. గోపురాకారంలో బతుకమ్మలను తీర్చిదిద్ది, పైభాగంలో గౌరీదేవిని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.…






