భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం నెల్లికుదురుతో పాటు పలు గ్రామాల్లో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. నవరాత్రుల మొదటి రోజు సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, బ్రాహ్మణుల వేదమంత్రోచ్ఛరణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దుర్గామాత నామస్మరణ, భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

మండలంలోని కాచికల్లు, మునిగలవీడు, వావిలాల, నెల్లికుదురు, ఎర్రబెల్లిగూడెం తదితర గ్రామాల్లో జగజ్జనని దుర్గాదేవి నవరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని ప్రత్యేక…