భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతోంది. నర్సాపూర్–మెదక్ రోడ్డులోని వన్ ప్యాలెస్ రెస్టారెంట్‌లో ఆహారం తీసుకున్న ముగ్గురితో పాటు మరికొందరు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. బాధితుల్లో కొందరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో, మరికొందరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే, వారు అస్వస్థతకు గురవడానికి గల అసలు కారణాలు ఇంకా అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

ఆహార నాణ్యతపై అనుమానాలు

రెస్టారెంట్‌లో ఆహారం తీసుకున్న తర్వాత పలువురు అస్వస్థతకు గురైనట్లు సమాచారం రావడంతో పట్టణంలో…