భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎరువుల దుకాణాల్లో రైతులకు ఎమ్మార్పీ ధరలకే ఎరువులను విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి ఎస్. విజయచంద్ర డీలర్లు, యజమానులకు సూచించారు. ఎరువుల విక్రయాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, రైతులకు కొనుగోలు చేసిన ఎరువులకు సంబంధించిన బిల్లులు అందించాలని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

ఇనుగుర్తి మండల కేంద్రంతో పాటు చిన్ననాగారం, చిన్నముప్పారం గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారి విజయచంద్ర, మండల వ్యవసాయాధికారి షేక్ యాస్మిన్‌తో కలిసి సందర్శించారు.…