భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తండ్రి అంత్యక్రియలను పెద్ద కుమార్తె నిర్వహించిన హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచి, విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రి అనారోగ్యంతో కన్నుమూయడంతో ముగ్గురు కుమార్తెలు కన్నీరుమున్నీరయ్యారు. వారిలో పెద్ద కుమార్తె ఉష తండ్రికి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ఈ దృశ్యం అక్కడున్న గ్రామస్తులను కంటతడి పెట్టించింది.
అనారోగ్యంతో తండ్రి మృతి
ఇనుగుర్తికి చెందిన బండారి రాములు (46) అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం కన్నుమూశాడు. తనకు ముగ్గురు…






