భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రైతులకు సాగు ఖర్చులను తగ్గించి, వ్యవసాయ పనులను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తోందని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటు ద్వారా రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్ర పరికరాలను అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
మంగళవారం మెదక్ జిల్లా నార్సింగి రైతు వేదికలో కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ యాంత్రీకరణ ప్రాధాన్యతను వివరిస్తూ,…






