భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని వలిగొండ గ్రామ సర్పంచ్ వెంకట పాపిరెడ్డి సూచించారు. పరిశుభ్రత అనేది ఒక్కరోజుకే పరిమితం కాకుండా ప్రతిరోజూ పాటించే అలవాటుగా మారాలని పిలుపునిచ్చారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రాజెక్టు పరిధిలోని వలిగొండ మండల కేంద్రంలో స్వచ్ఛత సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ వెంకట పాపిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…






