భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బ్యాడ్మింటన్ పోటీల్లో మెదక్‌కు చెందిన పవన్, వర్ధన్ జోడీ ప్రతిభ చాటుకుని ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామాయంపేటలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈ జోడీ విజేతగా నిలిచింది. పోటీల్లో పలువురు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
రామాయంపేట పట్టణంలోని బ్యాడ్మింటన్ కోర్టులో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో వివిధ జోడీలు పోటీపడ్డాయి. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లలో పవన్, వర్ధన్ జోడీ అద్భుత ప్రదర్శనతో మొదటి…






