భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రభుత్వం నిరుపేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు వెంటనే ప్రారంభించాలని గ్రామ ప్రత్యేక అధికారి, తహసీల్దార్ రజనీకుమారి సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో శనివారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, స్థానిక పరిస్థితులపై వివరాలు సేకరించారు. గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు…






