భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కక్షిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా సత్వరమే న్యాయం అందించేందుకు న్యాయవాదులు, న్యాయవ్యవస్థకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ హైకోర్టు జడ్జి ప్రవీణ్ కుమార్ సూచించారు. న్యాయవాద వృత్తిలో ఉన్నవారు ధర్మాన్ని పాటిస్తూ, అన్యాయాన్ని సహించకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తెలిపారు.

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోర్టు ప్రాంగణానికి చేరుకున్న హైకోర్టు జడ్జి ప్రవీణ్ కుమార్‌కు అధికారులు, న్యాయవాదులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.…