భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుతో పాటు కుటుంబ వ్యవస్థ, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి కమిటీ సమావేశం అదనపు కలెక్టర్ నగేష్ అధ్యక్షతన నిర్వహించారు.…