భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు ప్రాయోగిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని JNTUH కళాశాల ప్రిన్సిపాల్ డా. విశ్వనాథ రాజు, వైస్ ప్రిన్సిపాల్ డా. రాఘవేందర్ రావు, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డా. శైలజ సూచించారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకుంటే విద్యార్థులకు భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం సుల్తాన్పూర్ గ్రామంలోని JNTUHలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ARK Infosolutions సంస్థ…






