భారత్ సమాచార్, మెదక్ జిల్లా: సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, గౌరవం లభించినప్పుడే వివక్ష లేని సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తహశీల్దార్ మాలతి తెలిపారు. కుల, మత, వర్గ భేదాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవంతో మెలగాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతి పౌరుడికి అవగాహన ఉండాలని సూచించారు.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామంలో శనివారం గ్రామ సర్పంచ్ సంగని సునీత యాదగిరి అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహశీల్దార్ మాలతి, SI…






