భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం వావిలాల గ్రామంలో రైతులకు ఖేత్ బచావో అభియాన్‌పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. గ్రామ సర్పంచి గోగుల మమతా ప్రశాంత్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ, కేవీకే సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భూసార పరిరక్షణ, ప్రకృతి వ్యవసాయం, పంటల సాగులో పాటించాల్సిన పద్ధతులపై రైతులకు వివరించారు.
కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త సుహాసిని మాట్లాడుతూ.. రసాయన ఎరువులను మితిమీరి వినియోగించడం వల్ల భూమి సహజ సారం దెబ్బతింటోందని తెలిపారు. నేల…






