భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న మోహన్ గ్రానైట్ క్వారీ మూసివేత దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం రెవెన్యూ పరిధిలోని మీట్యా తండా సమీపంలో నిర్వహిస్తున్న ఈ క్వారీపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు క్లోజింగ్ ఆదేశాలు జారీ చేసినట్లు తండావాసులు వెల్లడించారు.
సర్వే నంబర్లు 152, 182లో కొనసాగుతున్న మోహన్ గ్రానైట్ క్వారీ లీజు గడువు ముగిసినప్పటికీ తవ్వకాలు మాత్రం ఆగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో సంబంధిత శాఖల…






