భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి, చట్టప్రకారం విచారణ చేపట్టి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు.

భైంసా పట్టణంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు, ఫిర్యాదులను…