భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, విద్యార్థులు చిన్నప్పటి నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఎం. హేమలత సూచించారు. చదువుతోనే మంచి భవిష్యత్తుకు పునాది పడుతుందని, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి సమాజానికి, దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నర్సాపూర్లోని బీసీ…






