భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన చేయూత పెన్షన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. BRS నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు సభా ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. BRS కౌన్సిలర్ మోయిజ్ను సభా వేదికపైకి అనుమతించకపోవడమే ఈ వివాదానికి కారణమైంది.
వివరాల్లోకి వెళితే.. నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్లో నూతన చేయూత పెన్షన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే…






