భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: రైతులు పండించిన పత్తి, మొక్కజొన్న పంటలను హుస్నాబాద్ మార్కెట్ యార్డులోనే కొనుగోలు చేసేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని బీఎస్పీ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డులో వేలం పాట విధానంలో కొనుగోళ్లు జరగాల్సి ఉండగా, కొందరు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా తమ ఇళ్ల వద్ద, అద్దెకు తీసుకున్న షెడ్లలో కొనుగోళ్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఈ కొనుగోళ్ల విషయంలో మార్కెట్…