భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఈ నెల 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి సుమారు 5 వేల మందితో భారీగా సిద్దిపేట సభకు వెళ్లేందుకు ఏర్పాట్లు…






