భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ తెలిపారు. ఇనుగుర్తి మండల కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో త్వరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ…






