భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట పట్టణంలోని యంగ్ ఇండియా స్కూల్‌కు కేవలం 200 మీటర్ల దూరంలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతిస్తూ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడంపై BJP నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, సమీప ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణానికి ముప్పు కలిగించేలా ఉన్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రామాయంపేట పట్టణంలోని సర్వే నంబర్ 1421లో మైనింగ్‌కు సంబంధించిన అనుమతులు, టెండర్ ప్రక్రియను నిలిపివేసి రద్దు చేయాలని…