భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి, జమ్మల తండా గ్రామాల్లో శనివారం వర్షాభావ పరిస్థితులు, నీటి వినియోగం, పంటల సాగుపై ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో రైతులకు పలు సూచనలు చేస్తూ నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని అధికారులు అవగాహన కల్పించారు.
దంతేపల్లి గ్రామంలో సర్పంచ్ మస్కూరి బాలరాజు అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు ఎంపీడీవో షాజీలుద్దీన్,…






