భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థులు చదువుతో పాటు సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణను చిన్నప్పటి నుంచే అలవర్చుకోవాలని రామాయంపేట తహసీల్దార్ రజని కుమారి సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పట్టణంలోని TG సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల బాలికల విభాగంలో శనివారం నిర్వహించిన సుపరిపాలన దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి దశ జీవితంలో ఎంతో కీలకమైందని, ఈ సమయంలో అలవర్చుకునే క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ప్రవర్తన భవిష్యత్తులో మంచి…






