భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాలను దృష్టిలో ఉంచుకొని రైతులు తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని నర్సాపూర్ మండల వ్యవసాయ అధికారిణి దీపిక సూచించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని అద్మాపూర్, జక్కపల్లి గ్రామాల్లో ఎల్‌నినో ప్రభావాలు, నీటి సంరక్షణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ అధికారిణి దీపిక మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు…