భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చెక్ బౌన్స్ కేసుల్లో కక్షిదారులు పరస్పర అంగీకారంతో రాజీ కుదుర్చుకోవడం ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ ఎం. హేమలత సూచించారు. ఇరువర్గాలు పట్టింపులకు పోకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, దీనివల్ల విలువైన సమయం, డబ్బు ఆదా అవుతాయని తెలిపారు.

జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ సూచనలతో మెదక్ జిల్లా న్యాయ సేవ…