భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఈ నెల 23న కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి వీరాచారి పిలుపునిచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
ఈ మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ను ఆయన నివాసంలో గొల్లపల్లి వీరాచారి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహా పాదయాత్రకు సంబంధించిన గోడపత్రికలను కేంద్ర…






