భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామంలో పుట్టలో నుంచి పురాతన లక్ష్మీనరసింహ స్వామి రాతి విగ్రహం బయటపడటం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. గ్రామానికి చెందిన ఓ భక్తుడికి కలలో నరసింహ స్వామి కనిపించి, పుట్టలో తన విగ్రహం ఉందని, దానిని వెలికితీయాలని సూచించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

ఈ విషయాన్ని ఆ భక్తుడు గ్రామస్తులకు తెలియజేయడంతో వారంతా కలిసి సంబంధిత పుట్ట వద్దకు వెళ్లి తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో పుట్టలో నుంచి పురాతన రాతి విగ్రహం…