భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు తెలంగాణ బాలికల జట్టులో హుస్నాబాద్‌కు చెందిన విద్యార్థిని బానోత్ అఖిల ఎంపికై తన ప్రతిభ చాటుకుంది. పంజాబ్ రాష్ట్రంలోని భటిండాలో ఈ నెల 24 నుంచి 28 వరకు నిర్వహించనున్న 44వ జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో అఖిల తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది.
అక్కన్నపేట మండలం మల్‌చెరువు తండాకు చెందిన మల్లేష్ కుమార్తె బానోత్ అఖిల ప్రస్తుతం హుస్నాబాద్ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో ఉంటూ ఇంటర్…






